తాతయ్య కథలు-34. -- ఎన్నవెళ్లి రాజమౌళి

 కుక్కను విశ్వాస జంతువు అని, గుర్రాన్ని బేమాన్ జంతువు అని ఎందుకు అంటారు అంటూ తండ్రి మల్లయ్యను అడగడంతో-
కుక్కకు పిడికెడు అన్నం పెడితే-వెంబడి తోక ఆడిస్తూ తిరుగుతుంటుంది. సయ్యాట లాడుతుంది.
రాత్రి ఏమైనా అలికిడి అనిపిస్తే... మొరుగుతుంది.
అందుకే కుక్కను విశ్వాస జంతువు అని అంటుంటారు.
గుర్రానికి ఎంత పెట్టినా... వీలైతే పడేయాలని చూస్తూ ఉంటుంది.
అందుకే గుర్రానికి కళ్లెం వేసి రౌతు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ప్రతిరోజుగుడాలు పెట్టినా.. గుర్రం బేమాన్ జంతువే.. ఎప్పుడో ఒకసారి పెట్టిన పిడికెడు మెతుకులకు విశ్వాసం గా ఉండేది కుక్క.
విశ్వాసం లేక ప్రవర్తించే వారిని కుక్క కున్న విశ్వాసము లేదు రా నీకు అంటారు కదా! అన్నాడు నాన్న మల్లయ్య.