*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౩౪ - 34)

 శార్దూలము:
*దినముంజిత్తములో సువర్ణముఖరీ | తీరప్రదే శామ్రకా*
*నన మధ్యోపలవేది కాగ్రమున నా | నందంబునం పంకజా*
*సననిష్ట నిన్ను జూడగన్న నదివో | సౌఖ్యంబు లక్ష్మీవిలా*
*సిని మాయానటనల్ సుఖంబులగునే | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
ప్రతీ రోజూ సువర్ణముఖీ నదీ తీరంలో వున్న మామిడి తోటలో ఎత్తైన అరుగు మీద కూర్చుని మనసులో నిన్ను తలచుకుని నిన్ను చుడగలిగినప్పడు కలిగే ఆనందం ముందు,  లెక్కలేనన్ని సంపదలతో హోయలు చూపించే స్త్రీలతో కలసి వుంటే దొరకే ఆనందం దిగదుడుపే కదా! ....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*నా మనసు నిండా నిన్నే నిలుపుకుని నేను పొందుతున్న ఆనందాన్ని మించే ఆనందం ఈ ఇలాతలంలో ఎక్కడైన దొరికే అవకాశం లేదు కాదా, పన్నగభూషా! నిన్నే నింపుకున్న నా మనసుకు వేరే ఏ సంతోషాలూ సంతోషాలుగా అనిపించవు, ఒప్పుకో లేము కూడా, గంగాధరా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు