నాన్న నాకు డబ్బులు ఇవ్వు. నేను సినిమా కి వెళ్ళాలి అన్నది ఆత్రుత. ఇప్పుడే ఎందుకమ్మా. కరోనా కాలంలో . అయినా ఫస్ట్ షో కు రద్దీ ఎక్కువ.
ఏయ్ ఎందుకే ఇప్పుడు సినిమాకు వెళ్ళంది నడవదా! అని అమ్మ అనగానే
.. నువ్వు ఊరుకో అమ్మ! నేను ఇప్పుడు 25 సంవత్సరాలు తెలుసా నాకు తెలవదా అన్నది.
పళ్ళు రాలుతాయి. ఎక్కువ మాట్లాడితే-అమ్మ అనగానే...
సుమిత్ర నువ్వు కొంచెం ఆగు అన్నాడు నాన్న.
మాకు ఇద్దరికీ కరోనా వచ్చింది కదా! మాతో ఉండి ఏమైనా అవసరం ఉంటే... ఇవ్వక సినిమాకు ఎందుకమ్మా అన్న తండ్రితో-
కొంచెం జలుబు అయినంత మాత్రాన దానిని కరోనాఅని బిల్డప్ ఇస్తున్నారా అంటూ వెళ్ళింది ఆత్రుత.
వారం రోజుల వరకు తన స్నేహితురాలు ఇంట్లో ఉండి వచ్చింది.
గోడకు వేలాడుతున్న నాన్న, అమ్మ ఫోటోలు చూసి ఏడుస్తుంటే.... పక్కింటి అతను వచ్చి -నేను నీకోసం ఎంతో ప్రయత్నించాను అమ్మా. ఫోన్ నెంబరు దొరకలేదు. చివరకు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మీ అమ్మ, నాన్నల అంత్యక్రియలు చేశారు.
నీవు అలా వెళ్లాల్సింది కాదమ్మా అన్నాడు. ఆ మాటతో ఏడుస్తూనే తలదించుకుంది ఆత్రుత.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి