ఎదురీత :---డా.కె .ఎల్ వి .ప్రసాద్ , హనంకొండ ...4
బాల్యాన్ని అందరూ ,
బహు ఖుషీగా 
గుర్తు చేసుకుంటారు.
గడిపిన ..
ఆనంద సమయాలను ,
గొలుసుకథల్లా ,
తలచుకుంటారు,
ఆ..రోజులు ..
మళ్లీ ..మళ్లీ ..రావాలని,
మనసారా ...
కోరుకుంటారు ,
జ్ఞాపకాల పుట్టని,
సమయమొచ్చి నప్పుడల్లా ,
తనివి తీరా ..
తవ్వుకుంటుంటారు !

దీనికి ..
పూర్తి బిన్నం ..
నా ..చిన్నతనం .
గుర్తొచ్చినప్పుడల్లా 
గరళం తాగినంత 
చేదుగా ఉంటుంది,
అతిగా ఆలోచిస్తే ...
వణుకుపుట్టి ..
వళ్ళంతా ...
తడిసిన గుడ్డ 
అయిపోతుంది .
జీవితంలో ...
బహు గడ్డు కాలం అది !

అంతా ...
మనమేలుకే అంటారు ...
మలి దశలో ...
అలాగే అయింది 
నా జీవితం .
ఆశ్చర్య పడడానికి ,
ఇంతకు మించిన ,
బ్రతుకు కథ ...
దుర్భిణీ వేసి చూసినా ,
దొరక్కపోవచ్చు !

ఎక్కడ కోనసీమ ?
ఎక్కడ భాగ్యనగరం ?
ఉహించని విధి 
ఉస్మానియాకు 
చేర్చింది నన్ను ,
అనారోగ్య భారిన పడ్డ ..
నేను ...
సోదరుల సంరక్షణలో,
మూడు సంవత్సరాల 
కాలం ...
ఆసుపత్రికే ..
అంకితం అయింది ,
నా టి ..బాధ _వ్యధ ,
వర్ణనా తీతం !

జీవితం లో 
ఎదురీత మొదలై,
భవితకోసం ...
మస్తిష్కం ...
సల ..సల కాగడం 
మొదలైంది ,
అక్షరాల వేటమొదలై,
సరస్వతీ కటాక్షం ..
ప్రాప్తించి,
అంచెలంచెల 
చదువు ..
స్పీడు బ్రేకర్లు 
దాటుకుంటూ ...
అగ్రజులకంటే ముందు ,
అగ్రస్థానానికి ..
చేరుకున్నా ....!

ఓసారి ...
వెనక్కి తిరిగి 
చూసుకుంటె ...
ఇప్పటి నా ...
ఈ జీవితం ...
కన్నవాళ్ళకి ,
విన్నవాళ్ళకీ ....
ఆశ్చర్యార్ధకమే !
అనుభవించిన నాకే ,
ఈ బ్రతుకు మలుపు,
పెద్ద ప్రశ్నార్థకం !!