తాతయ్య కథలు-41._ ఎన్నవెళ్లి రాజమౌళి

  రేపటి పని నేడు చేయి. నేడు చేసే పని ఇప్పుడే చేయి. అంటారు తెలుసా అల్లుడు! అని  మేనత్త అనగానే....
అంటే ఏమిటి అత్తమ్మ! పనుల విషయంలో అజాగ్రత్త చేస్తే-తడిసి మోపెడు తాయి.
రేపు చేసే పనిని కూడా నేడే చేయమని, మన పెద్దలు ఎంత బాగా చెప్పారు... పనులను అప్పటికి చేద్దామని, రేపు చేద్దామని అనుకోవద్దు.
ఈ మాట నా చదువు విషయంలో కూడా పనిచేస్తుందా అత్తమ్మ.
బాగా అడిగావు రా. ఏ రోజు పాఠం ఆరోజే చదువుకోవాలి. ప్రశ్నలకు జవాబులు కూడా నేర్చుకోవాలి.
ఇలా చేస్తే  పరీక్షలప్పుడు ఇబ్బంది ఉండదు కదా!
నిజమే ! నీవన్నది. పరీక్షలు సులభంగా రాయవచ్చు అని అత్తమ్మ అనగానే... అయితే కరోనా లో కూడా నిర్లక్ష్యం చేయకుండా చదువుకుంటా అన్నాడు అల్లుడు.
కామెంట్‌లు