తాతయ్య కథలు-42.:- ఎన్నవెళ్లి రాజమౌళి

 గురువింద పైన ఎరుపుతో అందంగా ఉంటుంది చూశావా! అని మనవడిని అడిగాడు తాతయ్య. చూసాను తాతయ్య ఆ గింజకు కింద నలుపు ఉంటుంది కదూ!
అవును నేను  అదే చెప్పబోతున్న పైన ఎరుపు ఉండడంతో మురిసి పోతుందట. ఆ గింజ కిందనే నలుపును మరిచిపోతుంది.
దీనికి ఏమైనా  అర్థం ఉందా తాతయ్య! బాగా అడిగావు . ఉంది. తన తప్పులు తనకు తెలువని వాళ్ళు ఎదురుగా ఉన్న వాళ్ల తప్పులు లెక్క పెడతారు.
ఎవరు ఎందులో గొప్ప వాళ్ళు కారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు మీ చదువులోనే.... కొందరు గణితంలో మెప్పు పొంది తే... ఇంకా కొందరికి ఆంగ్లంలో ప్రావీణ్యం ఉంటుంది.
కొందరికైతే తెలుగులో మంచి మార్కులు వస్తాయి కదా! నీవు అన్నట్టు మా మిత్రుడికి ఆంగ్లంలో మంచి మార్కులు వస్తాయి. బాగా మార్కు లు తెచ్చుకుంటానని గర్వం.
అలా ఉండవద్దు అని  తాతయ్య చెప్పే సరికి, అవును తాతయ్య అని మనవడు అనేసరికి-తెలుగులో నీకు ప్రావీణ్యం ఉంది కదా అనగానే... మనవడు పకపక నవ్వాడు.

కామెంట్‌లు