తాతయ్య కథలు-45. :- ఎన్నవెళ్లి రాజమౌళి

 ఎంత చెప్పినా కుందేలుకు మూడే కాళ్లు అంటా వేమి రా అని, మామయ్య అల్లుడుతో అనగానే...
కుందేలుకు మూడే కాళ్లు అంటే ఏమిటి మామయ్య  అని, అల్లుడు అడగగా...
ఎవరో వెనకటికి కుందేలు కాలు పట్టుకొని, మిగిలినవి లెక్క పెట్టాడట.
అప్పుడు ఎన్ని ఉంటాయని అల్లుడిని అడగగా-మూడు కాళ్ళే... నిజానికి కుందేలుకు కాళ్లు ఎన్ని  అని, మళ్లీ అడుగగా...
నాలుగు కాళ్లు మామయ్య. ముందుగా మూడే కాళ్లు అని చెప్పావు కదా.
ఒక కాలును పట్టుకుని లెక్క పెట్టాడు కదా మామయ్య.
ఆ... బాగా చెప్పావు. తను ఒక చేతిలో కాలును పట్టుకుని లెక్క పెడితే... ఎన్నిసార్లు లెక్కపెట్టిన కుందేలు కు మూడే కాళ్లు కాక, నాలుగు కాళ్లు లెక్కకు వస్తాయా.. అని మామయ్య అనగానే అల్లుడు నవ్వాడు.
కామెంట్‌లు