ఊరికే ఆట లేనా... అన్న అమ్మమ్మతో, అయితే నాకు ఒక కథ చెప్పవా అని అడిగింది మనవరాలు.
చెబుతా విను. అంటూ కథ మొదలు పెట్టగానే... మనవరాలు దగ్గరికి వచ్చి కూర్చుంది.
శివయ్య అనే పిల్లగాడు ఏ పని చెప్పినా చేసేవాడు కాదట.
ఒక నాడు వాళ్ళ అమ్మ-చెట్టు ఎక్కి చింతకాయలు తేరా శివయ్య అనగానే... చేతులు నొప్పులు ఉన్నవి అమ్మ అన్నాడట.
కట్టెలు కొట్టు రా శివయ్య అనగానే... కాళ్లు గుంజుతున్న వి అన్నాడట.
గిన్నె తెచ్చుకో రా శివయ్య అనగానే... ఆ మాట చెప్పు మా అమ్మ అన్నాడట.
తిండికి ముందుంటే సరిపోదు. పెద్దవాళ్ళు చెప్పిన పని చేస్తూ ఉండాలి. చిన్నప్పటినుండి పని అలవాటు కావాలి. అని అమ్మమ్మ అనగానే.. నేను ఇప్పటి నుండి ఏ పని చెప్పినా చేస్తానని మనవరాలు అనగానే... శభాష్ అని అన్నది అమ్మమ్మ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి