ముద్దుముద్దు పాపలంముద్దుగొలిపే పిల్లలంచిట్టిపొట్టి మువ్వలంవెలుగునిచ్చే దివ్వెలంఅమ్మకడుపు బిడ్డలంఅవని వెలుగు కాంతులంఆటలాడే కూనలంకలిసి తిరిగే పోరలంచెలిమి కోరు పాపలంప్రేమపంచు బాలలంమంచిమంచి పిల్లలంమనసు పంచే బాలలంభరతమాత భవితలంముందు తరం వీరులంఒకే దేశ పౌరులంఒకే దండ మల్లెలంచదువులన్ని చదువుతంగర్వoగా ఎదుగుతంఇంటి పేరు నిలుపుతoదేశం పేరు పెంచుతంఒకే తోట మొక్కలంపూలనిచ్చే నవ్వులంవాడిపోని పువ్వులంరాలిపోని నవ్వులంఆకసాన హరివిల్లుమమతలకే పొదరిల్లుమాగుండెల చిరుజల్లుకురిసింది విరిజల్లుఒకే కులం అందరంఒకే మతం అందరంమసనుషులం మనమంతామానవతా మనదంతా.
"ముద్దుముద్దు పాపలం"(బాలగేయం-5)చైతన్య భారతి పోతుల హైదరాబాద్ 7013264464
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి