గాలిపటానికి తోక ఎందుకు ఉంటుంది మామయ్య. గాలిపటాన్ని అదుపులో ఉంచడానికి. అంటే... మన శరీరాన్ని మనసు అదుపులో ఉంచినట్లా.. మామయ్య.
బాగా చెప్పావు రా... పోలిక. అవును. తోక లేని గాలిపటంలా మన ప్రవర్తన ఉండకూడదు.
సరే! ఇంతవరకు బాగానే ఉంది. మరి గాలిపటానికి ఉన్న దారం ఏమి చెబుతుంది.
కోరికలను అదుపులో పెట్టుకోమని చెబుతుంది. సంపాదనకు మించిన కోరికలుంటే... సంసారాలే దారం తెగిన గాలిపటంలా కూలిపోతాయి.
అంటే... మన స్థాయికి తగ్గట్టు మసలుకోవాలి. అప్పుడే చీకు చింత లేకుండా హాయిగా ఉంటుంది.
ఈరోజు గాలిపటం గురించి బాగా చెప్పావు మామయ్య. ఇక బై. నేను చదువుకోవాలి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు అల్లుడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి