బిడ్డల బంగారు భవితకై
అహర్నిహలు శ్రమిస్తూ
జీవితాంతం కుటుంబం కోసం
ప్రతి చెమట బిందువు
ధారపోస్తూ..
కష్టసుఖాల కావడిని మోస్తూ
ఎదిగొచ్చిన బిడ్డలు ఎదపై తన్నినా
తీపిముద్దుగా స్వీకరిస్తూ
ఉబికి వచ్చే కన్నీళ్లను
కనుగుడ్లకింద దాస్తూ
తాను కోల్పోయింది
బిడ్డలో చూసుకుంటూ
మురిసిపోయే ఆషాజీవి..
ముళ్ల దారిలో తాను నడుస్తూ
బిడ్డపాదాలకు దూలంటకుండా
తివాచీ దారి చూపెడుతూ
కోడికూతతో మేల్కొని
కాయకష్టాన్ని నమ్ముకొని
సర్వము ధారపోసే నాన్నే గొప్ప.
బిడ్డ ప్రతి సాహసోపేత
అడుగులో నాన్న స్మృతులు
నాన్న శ్రమ జీవనమే
బిడ్డ భవిష్యత్తు సంఘసేవకాదర్శం.
కొందరు తండ్రుల బాధ్యత
లేమితో
దురలవాట్లతో దారితప్పుతున్న
పసిబాల్యం అమ్మకు మిగులుతున్న కన్నీటి సంద్రం.
బాధ్యతతో నడుచుకుంటే
కళ్ళముందే కాదనలేని స్వర్గం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి