*"వాన తెచ్చిన సంబరం"*(బాలగేయం):-చైతన్య భారతి పోతుల-హైదరాబాద్-7013264464
వానా వానా వచ్చింది
సరదా సరదా తెచ్చింది
అరుబయటకు వచ్చాము
చెల్లీ నేనూ ఆడాము

పిల్లలందర్ని పిలిచాము
పిట్టగూళ్ళూ కట్టాము
పడవలు ఎన్నో చేసాము
వాననీటిలో వదిలాము

స్నేహితులంతా వచ్చారు
బొమ్మరిల్లులూ కట్టాము
చిట్టిపందిరి వేశాము
చుట్టూ అందర్ని పిలిచాము

వియ్యాలవారిని పిలిచాము 
చిలుకమ్మ పెళ్ళీ చేసాము
విందుభోజనం పెట్టాము
బహుమతి కూడా ఇచ్చాము