"పుట్టినరోజు"*:-చైతన్య భారతి పోతుల-హైదరాబాద్-7013264464
పుట్టినరోజూ వచ్చింది
కొత్త బట్టలూ కట్టింది
పెరటి తోటలోకెళ్లింది
పచ్చని మొక్కలు నాటింది

చక్కగ నీళ్ళూ పోసింది
కంచె కాపలా వేసింది
పూలూ పండ్లూ కాసింది
సంబర పడుతూ కోసింది

చిలుక ఒకటీ వచ్చింది
పాపాయికెంతో నచ్చిందీ
ప్రేమతో పండ్లను ఇచ్చిందీ
స్నేహ హస్తమూ కోరింది

నింగీ నేలా మురిసింది
పర్యావరణం పెరిగింది
ప్రకృతి ముసిముసి నవ్వింది
ఆశీర్వాదం ఇచ్చింది