పర్యావరణ రక్షణ - జల,తరు సిరులు (గేయ ప్రక్రియ):-- ఎం. వి. ఉమాదేవి ఇందుకూరు పేట నెల్లూరు-చరవాణి -7842368534
జలము తరువుల  పెంచు తుందిక 
నిన్ను రమ్మని పిలుపుతో 
పచ్చ పచ్చని పైరు పంటలు ధన్య మైనవి గింజతో 

మేఘ మాలలు క్రమ్ము కున్నవి సాగరమ్ముకు  పైననే 
భాను కిరణపు భాగ్యములతో మూడు వానలు కురియునే 

పులుగు గుంపులు పుణ్య మృగములు దాహములనిట తీరగా 
పరమపురుషుని లీల లందును ప్రకృతి హసియిం చగానే 

భవ్యవిశ్వపు పొరల రక్షకు  తరువులేగద మూలము 
ఒకటి పైన ఒకటిపెరుగును తరువులూమరి జలములూ!

తరువు కూల్చుట ఘోర పాపము కుములె ధరణియు నిజముగా 
ఋతువు మారును సెగలు రేపును భూమి బీటలు వారునే 

రక్షజేయుము పక్షి జాతుల పైరు పెరుగును పచ్చగా 
చీడ పీడలు పట్టకుండను ధాన్యమే సిరులిచ్చునే !