* డా || సి.నారాయణ రెడ్డి గారు *
సీస పద్యం
' విశ్వంభర ' కు తాను ' జ్ఞాన పీఠం ' పొంది,
' పద్మ భూషణు 'డుగా ప్రాప్తి పొందె ;
కేంద్ర ,ఆంధ్ర ల్లొ సాహిత్య కాడమి, పుర
స్కారాలు పొందారు డా. సి. నా. రె ;
బుర్రకథలు , గజళ్ళు , సినిమా పాటలు ,
తన ప్రపంచ పదులు... తరగని ఖని ;
ఆం. ప్ర.రాష్ట్ర మునందు అధికార భాషకు
అద్యక్షులై భాష అంద మిడియె ;
తేటగీతి
సాహి తీ వ్యాసకర్త , సంపాదకుండు ,
దేశ భక్తి , భక్తితొ పాట ... తీపి పంట ,
పంచ కట్టు , ఉర్దూ, తెన్గు ... పరవశించె ,
అతని వర్ధంతి సందర్భ ప్రణతు లివియె !!
~~~~~~~~@~~~~~~~~
జననం:19-07-1931#12-06-2017:మరణం
డా || సి. నా. రె # వార్కి స్మృత్యంజలి
స్ఫూర్తి * దీప్తి లేఖనం : రామానుజం. ప . జేబులో : 8500630543
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి