స్ఫూర్తి * దీప్తి -- లేఖనం : రామానుజం. ప . జేబులో : 8500630543

 

               *       గెలీలియొ      *
సీస పద్యం  
భౌతిక   శాస్త్రము  , సౌరమండ్ల,  ఖగోళ, 
            కైనమెటిక్సు   , డోలన క్రమాన్ని  ;
వర్గాలు  , వర్గుమూలాలు  ,  వర్గి కరణ  ;
            పనితీరు  , యాంత్రిక వస్తు శుద్ధి  ;
నేర్పె     తులా దండ      నిర్దేశ  పద్ధతి  ;
   టెలిస్కోపును తయారు చేయువిధము, 
వినియోగ  పద్ధతి ,  వింత  గొలిపె ; చూడ , 
         శాస్త్రాల  గెలిలియొ  మాతృ కాయె ;
తేటగీతి
తొల్త  వైద్య విద్యను నేర్చి,నొచ్చు కొనియె, 
గణిత  మందు  ప్రావీణ్యతా  గణుతి  కెక్కె ;
శాస్త్ర   పరిశోధన ల   యిష్ట    రాజ్య మేలి  ;
ఖ్యాతి    నొందెను   లోకాన   , తత్త్వ వేత్త   !! 
         ~~~~~~~~@~~~~~~~~
జననం:15-02-1564#08-01-1642:మరణం
            శ్రీ గెలీలియొ  #వార్కి స్మృత్యంజలి