స్ఫూర్తి * దీప్తి :- లేఖనం : రామానుజం. ప . జేబులో : 8500630543

 
                *      ఐన్  స్టీన్     *
సీస  పద్యం
"వృత్తి   నైపుణ్యాలు    ప్రోత్సహించాల్సిందె ", 
          అన్నారు , ఐన్ స్టీన్ మహాశయుండు  ;
భౌతిక  శాస్త్రాన    మునిగిపోయె  నతడు    ;
       తనకు '  నోబెలు ' వచ్చు ననుచు చెప్పి , 
సాధించి  ,  కాన్కగా    సతికిని  అందించె   ;
         అణువులు ఉనికిని  , కాంతి  గూర్చి  , 
'ఇ' సరితూగును ఎం.సి.స్క్వేరు'న కనియును, 
 (E = mc`2)థీరిఆఫ్ రిలెటివిటి ప్రతుల నిచ్చె  ;
తేటగీతి
స్వీయ  పఠనాన   దిక్సూచి  తీరు  తెలిపి  , 
మాసు , టైము  ,ఎనర్జీ ల.... మనసు విప్పె  , 
మంద బుద్ధి గా   నుండెనే ,   బాలు డప్డు  , 
నిలిచె ఇరవయ్యవ శతాబ్ది ప్రముఖునిగను  !! 
         ~~~~~~~~@~~~~~~~~
జననం:14-03-1879#18-04-1955:మరణం            
      ఐన్ స్టీన్   వార్కి  #    స్మృత్యంజలి