ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం 871 297 1999
ఎనుకటి
సిన్నప్పటి సోపతులే 
సొక్కం బంగారం లెక్కుంటయుల్లా!
కులాన్ని సూడకుంట
మతాన్ని  సూడకుంట
మనిషి రంగును సూడకుంట
ఒక్క మనసును జూసే 
సోపతి జేసేటోల్లం.
మాట్లాడినోల్లందరూ 
సోపతి గాల్లు కారుల్లా!
మనసుకు నచ్చినోల్ల తోనే
సోపతి పడుతం కదుల్లా!

మాలోల్ల కొంపల్లి రామయ్య,
బైండ్లోల్ల లాలయ్య
మాదిగోల్ల లచ్చిరాజం, 
సిన్న లచ్చిరాజం,
కొమ్ము దేవయ్య,ఎస్.దేవయ్య
శాలోల్ల సత్తె నారాయణ
బద్దమోల్ల ఎంకట్రెడ్డి
సామ నర్శిమ్మ రెడ్డి
కోమట్ల బూమయ్య,
మ్యాదరోల్ల శెంకరయ్య,
రామ సెంద్రం
గౌండ్లోల్ల బి. రాములు,
వి.అంజయ్య
సాకలోల్ల ఎల్.దేవయ్య
మేరోల్ల సత్తయ్య
మంగలోల్ల రామలింగం
తురుకోల్ల తాయర్ పాష 
గీల్లంతా ఎవలనుకుంటున్నరుల్లా?
నా సిన్నప్పుడు 
నేను సోపతి జేసినోల్లు.

గట్ల నేను అందరి తోని 
సోపతి జేసిన.
ఒక్కసారి నాతో 
సోపతి జేసినోల్లు 
ఇడువనే ఇడువరు.
ఔ మల్ల!