*ప్రగతికి తొలిమెట్టు* :--వేయిగండ్ల మణిదీప్, 8వ తరగతి.-యం.పి. యు.పి. యస్. జగదేవుపేట.-వెల్గటూర్ మండలం, జగిత్యాల జిల్లా.

 ఆకుపచ్చని ఆవరణ కోసం
పసిడిపచ్చని రాష్ట్రం కోసం
మానవ మనుగడ కోసం
భావి తరాల బతుకు కోసం
మొక్కలను  నాటుదాం
పర్యావరణాన్ని రక్షిద్దాం
కాలుష్యాన్ని నివారిద్దాం
భూతాపాన్ని తగ్గిద్దాం
ప్రకృతి అనేది దేవుడిచ్చిన వరం
దానిని కాపాడుకోవాలి మనందరం
ప్రకృతియే మన ప్రగతికి తొలిమెట్టు
ప్రకృతియే మన ఉనికికి ఆయువు పట్టు.