పొగబెట్టకు:-సి.శేఖర్(సియస్సార్),-పాలమూరు,-901048055
ఆరోగ్యం ఆనందం
నిత్యసంతోషం సంబరం
జీవనగమనం సుఖమయం
అదేకదా నేడందరికవసరం

ఎందుకో మనిషి తనకుతానే
దురలవాట్లకు బానిసైతున్నడు
అలసట తీరేందుకు ఇరుకునపడుతున్నడు
ఇల్లును గుల్లచేస్తున్నడు

తాగుతూ తందనాలాడుతూ
ఊగుతూ ఉసూరుమంటున్నడు
వ్యసనాల పద్మవ్యూహంలో 
ఇరుక్కుని బయటకురాలేక
నాశనమైపోతున్నడు

పొగతాగడం ఓ ప్యాషన్
డబ్బాపై రాసిన కాషన్ పట్టించుకోక
కాయాన్నంతా కాల్చుకుంటూ
సాటివారికికూడ పొగబెడుతున్నడు

ఓ మనిషి 
దుర్గంధంలో పొర్లాడే 
పంది కుక్కలు సైతం
ముట్టని పొగాకును 
నీవేల పీల్చుతూ
నిన్నునీవే పాడుచేసే 
తెలివిమాలినోడివౌవుతున్నవ్

నీ అలవాట్లు
కుటుంబానికాదర్శమవ్వాలి
రేపటి తరాలకు 
ఆరోగ్య వారథులవ్వాలి

నీవు తాగే బీడీ సిగరెట్ నీకేమిస్తుంది
తెలుసా నీకు ఆన్సర్
తాగితే వచ్చేది క్యాన్సర్
రాసున్న కాషన్ చదువుకో
నీవే సొల్యూషన్ వెదుక్కో
అందమైన ఫ్యూచర్ నిర్మించుకో..