మార్పెక్కడ?:-సి. శేఖర్(సియస్సార్),-ఫోన్:9010480557.
రాజ్యం కొత్తగా ఏర్పాటైతే
రాదెక్కడైనా మార్పు
రావాల్సింది రాజ్యన్ని సాదించుకున్న యోధులలోన
ఆ రాజ్యంలో ఏదో ఆశించి 
పోరాటానికి తెగించి 
రోడ్డెక్కిన జనంలోనే
స్వరాజ్యమైనా స్వరాష్ట్రమైన
సాదించడమేమంత గొప్పకాదు
ఉద్యమనేతలందరు రాజకీయనేతల పంజరంలో బందిలై బలిదానమై 
స్థూపాలలో చేరిపోతరు

మనమెందుకు సాదించుకున్నామన్న ధ్యాసెవరికుండదు
మన అవకాశాలెవరో ఎత్తుకెలుతున్న పట్టనివైనం
అజెండా
నిధులు నీళ్ళు ఉద్యోగాలు
ఇలా ఎన్నెన్నో 
ఆశల సౌధాలనేర్పరచుకున్న
నేలకొరిగి సమాదుల్లా మారుతుంటే
జేజేలు కొట్టి జెండాలు పట్టి
జనం ఓట్ల జాతరలో
మళ్ళీ అదే పాట
తాయిలాల పద్మవ్యూహంలో 
ఇరుక్కుని
భవిష్యత్తు తరాలకు తలనిండా అప్పులతిప్పలు
వెలుగురాని బతుకులు
మాటల మాంత్రికుల కుతంత్రాల రాజ్యం