నా దేశం పేదరికానికి చిరునామా
అన్నపూర్ణ నా దేశమే కానీ
ఆకలికేకల వారసత్వ సంపద
వీదివీదికి తోరణమై స్వాగతమిచ్చే చిత్రం
స్వర్ణభారతంలో ఆకలితీరని అభాగ్యులెందరో
ఆకలికి చిన్న పెద్ద తేడా లేకుండా
చెత్తకుప్పల్లో బాల్యం
ఎంగిలివిస్తరిలో ముసలితనం
మధ్యలో ఊగిసలాడే బతుకులెన్నెన్నో
అనాథలై రోడ్డుకిరువైపులా
అంబాసీడర్లై అడుక్కుతింటున్నరు
దోపిడిచేసే బడాబాబుల చేతిలో బంది నా భారతమాత
రాజ్యమెపుడు అధికారదాహంతో అతలకుతలం అగమ్యగోచరం
స్వార్థం శాసనమై సర్వం స్వాహా
ఇదెపుడు మారని చిత్రమే
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి