కారకులెవరు?:-సి. శేఖర్(సియస్సార్)-ఫోన్:9010480557.

 కాలమంతా   కాలుష్యపుకోరల్లో కొట్టుమిట్టాడుతూ
పుడమినంతా ఎడారిలా
మార్చేసే మనుషులు
దోచుకునే దొంగల్లా 
ఎక్కడి చెట్లను ఆక్కడే నరుకుతూ 
పచ్చదనమే లేని పుడమికి
వారసులౌతూ 
ఆయువుతీరిన తరానికి 
బాటలువేసే మూర్కులిక్కడే
భూబకాసురులు వాలిపోతూ
ధరణినంతా దోచేస్తూ 
తడారిన ఎడారిలా భూతాపానికి
కారకులు కర్కోటకులు
పరిశ్రమలపేరుతో గాలిని నీటిని భూమిని చెట్లను కాలుష్యానికి బలిచేస్తూ
ఊపిరాడక ఉసురుతీసుకుంటున్న దృశ్యాలు నేడెక్కడచూసినా
ఎంతెత్తుకెదిగినా
పర్యావరణానికి ముప్పు వస్తే
అప్పుడే మనవమనుగడ అంతం అదే సత్యం
ఎన్నో అందాలను సంతరించుకున్న భూమాత
సహజత్వాన్నంతా కోల్పోయి
కృత్రిమత్వాన్ని సింగారించుకుని
అణువణువునా స్వార్థాన్ని నింపుకున్న మనిషి చేతిలో
బందియై మోడుబారింది
ఇకనైనా కళ్ళు తెరవకుంటే
కళ్ళముందే జరిగే వినాశనానికి బలైపోవాల్సిందే