అందమైన ప్రకృతి:-సి. శేఖర్(సియస్సార్)-ఫోన్:9010480557.

అవనిపై అందాలు
మనసుకు ఉల్లాసభరితాలు
ఎంత రమణీయత
మనోహర రూపంతో
సేదతీర్చే ప్రకృతి ఒడిలో
స్వచ్ఛమైన గాలిలో
స్వేచ్ఛగా ఎగిరే పక్షులు
తమ కిచకిచల శబ్దాలు
కిలకిలా రవాలు 
మనసును మురిపించి
సుందర దరహాసమిచ్చు
ఆ అందమైన వనాలకాంచగా
అల్లంతా దూరంలో 
పారే సెలయేరుల గలగలలు
క్షీరధారలు కురిసినట్లు
కొండశిఖర అంచులకు చక్కిలిగింతులెడుతూ
కిందకు అందంగా దూకే
ఆ అజరామరమై జలధారలు
ఆదిగో ఆ పక్కనే
అందమైన లేళ్ళు చెంగుచెంగున గెంటుతూ
ప్రకృతికింకా వన్నెతెచ్చినట్టు
తెల్లని చెవులపిల్లుల పరుగులు
నెమలి పింఛమెత్తి నాట్యమయూరియై నడయాడింది
ఎక్కడచూసిన పచ్చదనమే
ఆకాశటుటంచులు తాకే 
కొండశిఖరాల అంచులదాక
అల్లుకుపోయిన ఆకుపచ్చని
తరువులు సుందర వనాలైనవపుడు
అయ్యే అవన్నెక్కడిపుడు
కనుచూపుమేరలోనైనా
ఎంతవెదికినా కనిపించవేమే
ప్రకృతిని నాశనంచేసే వికృతి
నేటి నాటు మనిషి
వినాశనంవైపడుగులేసి
విశ్వమంతా నాశనం చేసే
వికృతచేష్టలతో మనిషికి మరోరూపమే నేటి దృశ్యం
పర్యావరణ నాశనం
యుగాంతానికది శాసనం