మారనిదీతీరు:-సి. శేఖర్(సియస్సార్),-ఫోన్:9010480557.

 నా దేశంలో
పార్టీలకు లెక్కలేదు
జెండాలకు కొదవలేదు
జాతీయతేమోగానీ
ప్రాంతీయత ప్రాణంపోసుకుని
రాజకీయమంటే 
నేడో రణరంగమే
కులకులానికో పార్టీ
మతమతానికో జెండా
అణగారినవాడెంత అరచి
గీపెట్టినా 
అణిచివేతలతోనే తొక్కేసే బడానేతలు
సంహాసనంపై మాత్రం ఉన్నోడే
తిష్టవేసే నైజం 
రాజకీయ చదరంగం ఉన్నతులాడే ఆట
గెలుపే వారికిష్టం