సమస్తం ఆమె స్వరూపమే
ఆపాద మస్తకం శ్రమించే తత్వం ఆమె గుణమే
ఆకాశంలో సగమంటారు
ఆలోచనలను మాత్రం అణువణువూ ప్రశ్నిస్తారు
ఉధ్యమ రంగాన ఉడుకునెత్తురై ప్రవహిస్తుంది
విద్యా విషయ సమూహంలో
విజయకేతనమెగరేస్తుంది
గగనసీమన ఎగిరే విహంగమై విరాజిల్లుతుంది
నమ్మకాలను వమ్ముచేయని నాయకిగా వెలుగుతుంది
అయినా,
నిముషాన్ని నమ్మని క్షణం
నీడలా వెనుకెనుకే తిరుగాడుతుంటే
ఉదయించాలని ఉబలాటపడే
అభ్యుదయభావాలు
ఉరికొయ్యలనాశ్రయిస్తున్నాయి
తెగిన తలలై తలోవైపు వేలాడుతున్నాయి
స్వాగత తోరణాలను ఆశించదు
వంధిమాగధుల పొగడ్తలు వాంఛించదు
అవధిలేని ప్రేమకు ఆమే ఒక తొలి పలుకు
వారధిగా నిలుచుండి సారధియై తోడుంటే చాలు
మహిళాభ్యుదయపథంలో
మరిచిపోని కీర్తిశిఖరాన నిలిచి
మహోన్నతమవుతుంది..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి