మేంపిల్లలం...కాదుపిడుగులం:--- పోలయ్య కవి కూకట్లపల్లి--అత్తాపూర్ హైదరాబాద్...9110784502
మేం పిల్లలం బడిపిల్లలం
కాదు కాదు పిడుగులం
రేపు మేమే భావి భారతపౌరులం 

మేం పిల్లలం బడిపిల్లలం
కాదు కాదు పిడుగులం
రేపు మేమే అమ్మానాన్నలకు గొడుగులం

మేం పిల్లలం బడిపిల్లలం
కాదు కాదు పిడుగులం
రేపు మేమే అవ్వాతాతలకు అడుగులం 

మేం పిల్లలం బడిపిల్లలం
కాదు కాదు పిడుగులం
రేపు మేమే రాజ్యాలనేలే మహారాజులం

మేం పిల్లలం బడిపిల్లలం
కాదు కాదు పిడుగులం
రేపు మేమే గూటిలోగువ్వలం
ఘల్లుఘల్లుమనే కాలి మువ్వలం
ఎగిరే తారాజువ్వలం రగిలే నిప్పురవ్వలం

మేం పిల్లలం బడిపిల్లలం
కాదు కాదు పిడుగులం
ఎందుకు మాపై కోపాలు తాపాలు 
రేపు మేమే ఇంటికి ఆరనిదీపాలం
నీతికి నిజాయితీకి నిర్మలత్వానికి 
స్వచ్ఛతకు ప్రేమకు మేమే ప్రతిరూపాలం 

మేం పిల్లలం బడిపిల్లలం
కాదు కాదు పిడుగులం
భోదించాలి మాకు మంచినీతులు
అందించాలి మీ చల్లనైన చేతులు

మేం పిల్లలం బడిపిల్లలం
కాదు కాదు పిడుగులం
కాదు కాదు మేము కొంపలుకాల్చే కోతులం
రేపు మేమే బంగారుగుడ్లుపెట్టే బాతులం


కామెంట్‌లు