ఓర్పులో భూదేవి:--డా గాజులనరసింహ-నాగటూరు గ్రామం-కర్నూలు జిల్లా-9177071129

 'మహిళా'...అనే పదం లోనే 'మహి ' అనే పదం ఉంది 
'మహి ' అంటే భూమి  భూమికి ఎంత ఓర్పు గలదో...
మహిళకు అంతే ఓర్పు గలదు  అందుకే స్త్రీకి మహిళ అనే పేరు వచ్చింది
పెళ్లి అయినాక రెండు కుటుంబాలకు పరువు ప్రతిష్టలకు  ప్రతీకగా నిలుస్తుంది. మహిళ
అమ్మగా ,ఆలిగా, అక్కగా ,చెల్లిగా, పాత్రలు పోషిస్తూ... అవనిలో  అవతారమూర్తిగా నడియాడుతుంది మహిళ...
మహిళా అంటే మామూలు మనిషి కాదు సాక్షాత్ అదిశక్తి  స్వరూపము.అందుకే ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఓర్పుతో  భరిస్తూ కుటుంబంలో అత్యధిక పాత్ర పోషిస్తుంది మహిళ.
నిత్యం ఆచంద్రార్కమై  మహిలో మహిళ వెలుగొందుతూ వుంది. ఆత్మీయతకు  ప్రతిబింబమై  అనురాగాలకు అనుబంధాలకు   అనుసంధానంగా వ్యవహరిస్తూ..జాతికి వన్నె తెస్తూ..ఈ జగతిలో మహోన్నత మూర్తిగా ప్రసద్ధికెక్కుతూ ..ప్రశంసాత్మకంగా కొనియాడుతుంది మహిళ .