ప్రకృతి:-పేరు: డాక్టర్ విజయలక్ష్మి పున్నహైదరాబాద్ : -చరవాణి: 9182741217
పర్యావరణమే ప్రకృతి
ప్రకృతియే ప్రాణవాయువు
ప్రాణవాయువే జీవకోటికి శ్వాస
జీవుల శ్వాసయేశజీవకోటి మనుగడ

జీవకోటి మనుగడయే
జనజీవన చైతన్యం
జనజీవన చైతన్యమే వసంతరుతువు
వసంత రుతువు ప్రకృతి పక్షుల కిలకిలరావాలు-కిచకిచలు

కోయిల ఆమని కుహూ కుహూ రాగాలు
చిలుకమ్మ చిలుక పలుకులు
లేత చిగుళ్ళు ప్రకృతి సెలయేళ్ళ
ఝుమ్మనే నాదం కొత్త ఆశల చిగురుటాకు

ఆ ఆశే మనిషి మనుగడ 
మనిషి మనుగడయే  జీవకోటి 
మనుగడ అంతా ప్రకృతి మాత దేవి ప్రసాదమే ఈశ్వర అనుగ్రహమే!!