జ్ఞాపకాల పూల పరిమళం:-*"రసస్రవంతి" --"కావ్యసుధ"*9247313488 : హైదరాబాద్
సంపాద నొక చిక్కు
సంసారం మొక చిక్కు
సంఘ జీవన మందు
సాగి పోవగ చిక్కు
చిక్కుల ముడులను తెంచుమా
చిచ్చర కంటి
ముప్పుల దహించుమా !

శ్రీలక్ష్మి అత్తoట
వాణి నీ కోడలట
యుగయుగముల నుండి
ఇద్దరి మధ్యన మంట
అత్త కోడళ్ల పోరు
ఇంటిలో
బ్రతుకు అంగడి బజార్

 ఉత్తరాయణ మైన
 దక్షిణాయాన మైన
 ఏదో వాయన మైన
 లేక పయనమ్మన
 పనులేవి కాకున్నవి
 ఈ జగతి
 పతనమై పోతున్నది.