పద్యం : -మమత ఐల-హైదరాబాద్-9247593432

 దత్తపది
(కరువు, తరువు,బరువు, పరువు)పదాలతో పద్యాలు
కం
కరువులు తీరును; పెంచిన
తరువుల వాయువులచేత తరగని ఫలముల్
బరువని తలచకు చెట్లను
పరువగు సుఖశాంతి తోడ ప్రాణము నిలుపున్ 
కం
కరువన్నది రాకుండనె
తరువులెపుడు పెంచవలయు ధరణిజనులకై
బరువగు విషమే పీల్చుచు
పరువగు నారోగ్య మిచ్చు పచ్చదనముతో