దత్తపది--(ఆటు పోటు చాటు పాటు) పదాలతో పద్యాలు:-మమత ఐల-హైదరాబాద్9247593432

ఉ.
ఆటులు వచ్చెనేని శివు నాగ్రహమంత త్రినేత్రమందునే
పోటులొనర్చ కోపమున వోర్పునుదప్పుచుతెర్చుకన్నునే
చాటుగదాగినన్ సెగల శౌర్యమునాపగ సాధ్యమామరిన్
పాటులనోర్చుకొమ్మనుచు పామరజాతిని కానవాశివా!
ఆ.వె
ఆటు పోటులందు నలసిసొలసిపోయి
చాటు మాటునందు సాగుటేల
పాటు నెరిగితరలి దీటుగా పోరాడు
మనసుపెట్టి వినుము మమతమాట