హనుమాన్ జయంతి సందర్భంగా:-మమత ఐలహైదరాబాద్9247593432

 
సీస పద్యం
లంకకేతెంచెను రఘురామభక్తుడు
     సీతమ్మ జాడకై శీఘ్రముగను
జానకమ్మనుజూసి గానాలువినిపించె
      చెట్టు కొమ్మనదాగి చిత్రముగను
నంగుళీకముతెచ్చి నమ్మయనిచుజూపె
      రామయ్య గుర్తుకై రమణికపుడు
నయనాలకద్దెను నమ్మకంబు కుదిరి
       రామముద్రికయని రయముతోడ
ఆ.వె
పవన పుత్రుని గని పరవశించెనుసీత
రామధూతయనుచు రందివీడి
లంకతగులబెట్టె రగిలిపోయినకపి
మనసుపెట్టివినుము మమతమాట