దత్తపది (అతి మతి గతి జత)పదాలతో పద్యాలు:-మమత ఐలహైదరాబాద్9247593432

 కం
అతిగా వెతనే చెందిన
మతిపోయి సులోచనలకు మార్గము దప్పున్
గతిదప్పక సాగినచో
జతగా నీ మనసు నీకు సహకారంబౌ
కం
అతివల యందమె యందము
మతినే పోగొట్టెను కద మౌనియె చూడన్
గతియే వైపున తిరుగునొ
జతగా మేనకనుగాంచి జపమే వీడెన్