షిరిడి క్షేత్రం....:-"రస స్రవంతి" & "కావ్యసుధ"-9290215858/9247313488-*హయత్ నగర్* హైదరాబాదు.
శ్రీకరుడై సద్గురు
పదములు
పరమాత్ముని
పరిపూర్ణ రూపములు
సాయినాథుని
అభయ సూత్రములు
నమ్మిన వారికి
జ్ఞాన దీపములు
జయ షిరిడీశుని
చిన్మయ రూపుని
తల్లిదండ్రులు
ఎవరో తెలియదు
కులమత వివరము
లసలే తెలియదు
దర్శనమిచ్చెను
బాలఫకీరుగా
భావనకందని
భగవంతునిగా
షిర్దీ పురమున
వెలిసెను సాయి

రవితేజస్సు
కలిగిన యోగీ
రాగద్వేషాలు
లేని విరాగి
చంద్రుని బోలిన
చక్కని సాయి
చల్లని దీవెన
లిచ్చును హాయి
పావన చరితుడు
ఋషిజన సేవకుడు 
భక్త జనావళి
హృదయ విహారి
భగవద్గీతకు భాష్యం
చెప్పిన వాడు
ఖురాను పదములకు
అర్థము తెలిపినాడు 
ఖండ యోగముచే                          
నరనరాలను
శుద్ధి పరిచాడు
గురు కటాక్షమును
పొందిన ఘనుడు
సద్గురువై దయ చూపివాడు                          
 గోధుమ పిండితో కలరా వ్యాధి
నయం చేసినవాడు 
ఉదకముతో
దీపములను వెలిగించిన వాడు
ఇది విని.....ఇది గని 
షిరిడి ప్రజలు నివ్వెరపోయిరి 
యోగశక్తితో ధుని వెలిగించి
దివ్య విభూతిని అందించాడు
మసీదును ద్వారకామయి చేసి
షిరిడి పుణ్య తీర్థంగా చేశాడు.