జీన్ చికిత్స(సైన్స్ వ్యాసం):- కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

   వంశపారంపర్యంగా తల్లిదండ్రులనుండి కొన్ని లక్షణాలు పిల్లలకు సంక్రమిస్తుంటాయి.   ఉదా-
హరణకు శరీరం రంగు,జుట్టు, కళ్ళరంగు మొదలైనవి.కొన్ని జబ్బులు కూడా వంశ పారం- పర్యం గా సంక్రమించవచ్చు.
        వీటన్నిటికీ కారణం మనలో ఉండే జీన్స్ అనే సమాచార పోగుల(DNA STRAND=DEOXY RIBO NUCLEAC ACID) వ్యవస్థ.
        మన ఆరోగ్యం,కొన్ని లక్షణాలు ఈ జీన్స్ లో నిక్షిప్తం అయి ఉంటాయి! 
        కొన్ని కారణాల వలన ఈ జీన్స్ లో లోపం వలన భయంకరమైన జబ్బులకు దారితీయవచ్చు.ఉదాహరణకు 20ఏళ్ళ వయస్సులోమామూలుగా ఉండాల్సిన కొలెస్ట్రాల్(LDL=low density lipid) పది రెట్లు పెరిగి పోయి,రక్త నాళాలు మూసుక పోయి గుండె జబ్బు లేక హార్ట అటాక్ రావచ్చు! దీనికి కారణం జన్యు లోపం.
        ఇటువంటి క్లిష్టమైన రోగాలను మందులతో కాకుండా,ఈ జీన్స్ లోని లోపం సవరించి(రి కాంబి నేషన్ జీన్స్) ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక విశ్వ విద్యాలయాలు పరి శోధనలు 
ముమ్మరంగా చేస్తున్నాయి.
        ఇప్పటికే చిన్నపిల్లల్లో జీన్ లోపం వలన సంభవించే రోగనిరోధక లోపాన్ని సవరించడం అంటే
 ఆరోగ్యకరమైన జీన్ ప్రవేశ పెట్టడం వలన రోగ నిరోధక  శక్తిని అభివృద్ధి చేశారు.
        కొన్ని రకాల కాన్సర్లు,మూత్ర పిండాల వ్యాధులు,లివర్ వ్యాధులు కూడా ఈ జీన్స్ లోపం వలన కలుగుతున్నట్టు పరిశోధనలు తెలుపుతున్నాయి.
       ఇప్పుడు అనేక దేశాల ప్రభుత్వాలు ఈ జీన్ చికిత్సకు ఆమోద ముద్ర వేశాయి.ప్రస్థుత పరిస్థితుల్లో  ఇది
చాలా ఖరీదైన వైద్యం.ఈ చికిత్స మీద మరింత అవగాహన పెరిగి,సాంకేతిక అభివృద్ధి జరిగితే
గణనీయంగా చికిత్స ఖర్చులు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.లోపంతో ఉన్న జీన్స్ ని సులభంగా గుర్తించడానికి శాస్త్రజ్ఞులు కృషి చేస్తున్నారు.
      ఈ దశలోనే ఈ జీన్స్ చికిత్స,జీన్ లోపం  కారణంగా సంభవించే రోగాలను గుర్తించడం,ఏ జీన్ లోపం వలన ఏ రోగం సంభవిస్తుందనే విషయం మీద చేసే విస్తృత పరిశోధనలకు 'హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు'ను నెలకొల్పారు.లక్ష మందిలో ఒకరికి సంభవించే 'సిస్టిక్ ఫైబ్రోసిస్(ఊపిరి తిత్తుల వ్యాధి), హిమోఫిలియా(రక్తం గడ్డ కట్టక పోవడం) కొన్ని రకాల కాన్సర్ వ్యాధులకు జీన్ చికిత్స చేయవచ్చు.
      కానీ,ఈజీన్ చికిత్సలో నిపుణుల పాత్ర ఎంతో ఉంది..తప్పుడు జీన్ మార్పిడి చేస్తే అసలుకే మోసం వస్తుంది.అందుకే అమెరికా,జర్మనీ మొదలైన దేశాలలో జీన్ చికిత్స కోసం చట్టం,ఆచరణయోగ్యమైన అనేక సూత్రాలు రూపొందించారు.
         జీన్ చికిత్స పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే కొన్ని మొండి రోగాలున్న రోగుల్లో ఆనందకరమైన ఒక కొత్త కోణం మనం చూడవచ్చు.