పోషకాహార నిపుణులు ఆలివ్ నూనె వాడకం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.కానీ దీని ఖరీదు కొంచెం ఎక్కువ.
ఈ ఆలివ్ చెట్ల పంట ఎక్కువగా మధ్య ప్రాశ్చ్యదేశాలలో(France,Greece,Italy, spain దేశాలు) పండిస్తున్నారు.ఈ దేశాలు మూడు వేల సంవత్సరాల నుండి చెట్లను పెంచుతున్నాయి! ఆలివ్ చెట్టు శాస్త్రీయ నామం 'ఓలియా యూరోపియా'(olea europaea).పురాతన కాలం లోనే ఆలివ్ నూనెను కేవలం వంటకాలలోనే కాకుండా గాయాలకు,శరీర దురదలకు వినియోగించినట్లు తెలుస్తోంది.ఈ నూనెను ఉపయోగించేవారు ఎక్కువ కాలం బతుకుతున్నట్లు పరిశోధనలు తెలియ చేస్తున్నాయి.
ఇతర వంట నూనెలు మోస్తరు ఇది రక్త నాళాల్లో చెడు కొవ్వు పేరుకోకుండా చేస్తుంది! అందుకే గుండె వ్యాధి నిపుణులు వెన్న,నెయ్యి బదులు ఆలివ్ నూనె వాడమని సూచిస్తున్నారు.దీనిని క్రమం తప్పకుండా వాడితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.రక్తపు పోటును తగ్గిస్తుంది.
ఇది ఎక్కువ కెలోరీల శక్తి(టేబుల్ స్పూన్ నూనెలో 120 కెలోరీల శక్తి) కలిగి ఉన్నా, శరీర బరువు తగ్గిస్తున్నట్టు పరిశోధనలలో తేలింది. పరిశోధనల్లో కారణం తెలియకున్నా దీని వాడకం వలన కీళ్ళ నొప్పులు తగ్గుతున్నట్లు వైద్యులు,పరిశోధకులు చెబుతున్నారు.
ఆలివ్ నూనెలో మానో సాచురేటడ్ ఫాట్టీ ఆసిడ్స్ ఉంటాయి.అందుకే ఆలివ్ నూనె గుండె పోటును పెంచే ప్రమాదకర కొవ్వు(LDL)ను తగ్గిస్తూ,గుండెకు మేలు చేసే కొవ్వు(HDL) మీద ప్రభావం చూపదు.
తల వెంట్రుకలు రాలి పోతున్న వారు కనీసం ఎనిమిది రోజులు ఆలివ్ నూనెను మర్దనా చేసి తల స్నానం చేస్తే వెంట్రుకలు రాలి పోవడం తగ్గి పోతుందని గమనించారు.
ఆలివ్ నూనె వృధాప్యంలో కలిగే గుండె జబ్బులను నివారిస్తున్నట్టు 'అమెరికన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్' లో వివరించారు.ఆల్జిమర్స్ (మతిమరపు వ్యాధి) వ్యాధి భారీన పడకుండాకూడా ఆలివ్ ఆయిల్ కాపాడుతుంది.
'జర్నల్ ఆఫ్ కెమికల్ న్యూరో సైన్సస్' లో ఈవిషయం వివరించారు.
మన దేశంలో సూపర్ మార్కెట్లలో దీనిని విక్రయిస్తున్నారు.
పొద్దు తిరుగుడు పువ్వు నూనెతో పోల్చినా ఇది ఎంతో మంచిదని అమెరికాకు చెందిన US NEWS HEALTH లో వివరించారు.
ముఖ్యంగా ప్రపంచ ఆలివ్ నూనె ఉత్పత్తి లో సగం స్పెయిన్ దేశం ఉత్పత్తి చేస్తుంది!
Alex Dingwall అనే రచయిత
స్పెయిన్లో గల రెండువేల సంవత్సరాలనాటి ఆలివ్ చెట్టును గురించి Angel Tree అనే అత్యధ్బుత వ్యాసం వ్రాశాడు.
ఆలివ్ నూనె------లాభాలు:-- (సైన్స్ వ్యాసం) -కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి