పద్యం : -బెజుగాం శ్రీజ ట్రిపుల్ ఐటీ బాసరగుర్రాలగొంది జిల్లా సిద్ధిపేట-చరవాణి:9391097371.


 1ఆ.వె.
 గాజులగలగలతొ మోజులోనపడియు
మొదటిజూపులోన మురిసిపోయి
మనసులోనమాట మన్మధుడెతెలిపి
ప్రేమనందుపంచె ప్రీతితోడ
2ఆ.వె.
చేత కలువ పువ్వు చిగురించ తెంపెను
నడుముపైనయందు కడవబెట్టి
మువ్వలనుతొడిగియు సవ్వడినేజేస్తు 
తలతలమెరిసేను ధరణియందు