సీసదీపం( చిత్ర కవిత)--బెజుగాం శ్రీజ-ట్రిపుల్ ఐటీ బాసర-గుర్రాలగొంది జిల్లా సిద్ధిపేట-చరవాణి:9391097371.


 
 సీసం:
విద్యుత్తుపోవగ వేచిజూసి ప్రజలు
దీపమువెలిగించు తేలికగను
కాంతినిచ్చిమనకు కష్టాలు పోగొట్టి
నవసరములు దీర్చు నవనిలోన
యజ్ణానముయనెడి నంధకారముబాపి
విజ్ణానమనియెడి వెలుగునిచ్చు
నేటితరములోన నెవరునువాడక
కనుమరుగాయెను  గాంచినంత
*ఆటవెలది*
దీపమువెలిగించ దివ్య కాంతిని నింపి
వెలుతురెంతొనిడును ప్రీతితోడ
అవనిలోనదీని నందరువాడగ
మంచిజరుగుచుండు మనకునెపుడు.
దత్తపదులు
తే.గీ.
*తరువు* లు నరుకుచుండగ ధరణిలోన
*కరువు* కాటకాలేర్పడి క్షామమొచ్చు
*బరువు* బాధ్యతలనుమోస్తు భారమనక
*పరువు* నిలుపుకోసతతము తరులబెంచి.