పద్యం : -*బెజుగాం* *శ్రీజ**ట్రిపుల్ ఐటీ బాసర**గుర్రాలగొంది* *జిల్లా సిద్దిపేట**9391097371*

 1.తే.గీ.
పురిటినొప్పులు భరియించి పుడమినందు
ప్రసవమునిడును బిడ్డకు భారమనక
సంతసంబునుపడుతూనె జగతిలోన
పరిచయముజేయుగొప్పగా మురిసిపోయి
 2.*సీసం*
నవమాసములుమోసి నవనిలోబిడ్డకు
జన్మనిచ్చునుతల్లి చక్కగాను
పుడమిలోననుతాను నడుగునుమోపగా
నెదకుహత్తుకొనును ముదముతోడ
నందరికినిజూపి హాయినిపొందుతూ
పరిచయమునుజేయు పరవశించి
కష్టమురాకుండ కంటికిరెప్పలా
కాపాడుకొనుచుండు గారవముగ
*ఆటవెలది*
జన్మనిచ్చితల్లి సంతోషపడుచుండ
కన్నప్రేమజూపి కాపుగాచు
మురిసిపోయితాను ముద్దులాడుకొనుచు
లాలబోసి యమ్మ జోలపాడు