*సీసపద్యం*
నేతకార్మికులెల్ల నిత్యము పనిజేసి
వస్త్రముల్ నేసేరు వాసిగాను
సింగరేణిగనిలో స్వేదము చిందించి
విద్యుత్తు తీసేరు వెలుగు కొరకు
రాత్రిపగలనక రైతులుకష్టించి
యాకలేదీర్చుదు రవనిజనుల
గురువుబోధనజేసి గొప్పగాశిష్యుల
తీర్చిదిద్దునెపుడు తెలివితోడ
సైనికు లెల్లరు శత్రువులతరిమి
దేశరక్షకొరకు దీక్ష బూని
రక్షకభటులంత రౌడీలబట్టియు
చెరసాలలోవేయ శిక్ష బడును
సాధనజేయగా సమకూరుపనులెన్ని
చేయాలి ప్రతిరోజు చెలిమితోడ
*తేటగీతి*
పనులు కష్టమై యున్నను వదలకుండ
పట్టుదలతోడజేసిన ఫలితమొచ్చు
శ్రమను జేయగధరలోన శక్తిపెరిగి
యవసరాలన్నినెరవేరు నందరికిని
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి