ఆయుర్వేదం
సీసపద్యం
పుడమినాయుర్వేదమును వాడగా వేడ్క
రక్షణ దొరుకును లక్షణముగ
మూలిక లన్నియు బూరిగాకొనిదెచ్చి
మందులు జేసేరు మంచికొరకు
రాతిరికాగానె రయముగానిద్రించి
వేకువగనులేవు వేగిరముగ
వ్యాయామముదినము బాగుగాజేయగ
శక్తియెపెరుగును యుక్తికొరకు
ఆకుకూరలెపుడు నందరుతినగాను
రోగములుతొలుగు లోకమందు
కష్టముచేయగ కావాలి విశ్రాంతి
తీసుకొనవలెను తృప్తి మీర
ఆవుపాలనుత్రాగ హాయిగామనకును
బలముపెరుగుచుండు బ్రతుకుకొరకు
*తేటగీతి*
వైద్య చిట్కాలనెపుడును పఠనజేయ
మంచి ఫలితమే వచ్చును మనకు నెపుడు
సంతసంబునుపడుకుంటు జనులెయంత
ఆయు రారోగ్య ములతోడ నలరుచుండు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి