*సీసపద్యం*
శ్రీరామరక్షణే శ్రీకారమేచుట్ట
మంచిజరుగుచుండుమానవులకు
ఫలితమ్ము నాశించిపనులుమొదలుపెట్ట
శ్రద్ధగనెరవేరు సత్వరముగ
దైవమున్ పూజించిధ్యానమేచేయగ
కష్టాలు తొలగించి కరుణజూపు
ఆధ్యాత్మికతచింత నందరుపాటించ
భక్తి భావముహెచ్చి ముక్తిగలుగు
*తేటగీతి*
చిన్న తనములోనుండియు చెలిమిమీర
దైవ స్మరణనుజేయగదండిగాను
జ్ఞానమెంతయొచేకూరి సాగు చుండ
కష్టములుపోయిసుఖములుకలుగుమనకు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి