*గర్వ పడగ నేల ఘనుడవనుచు*
1 *ఆ.వె.*
తల్లిదండ్రులునిను ధరణికిజూపియు
ధైర్యమంత నింపె తనువునిండ
గురువు తీర్చిదిద్ది గొప్పగా మలచగ
గర్వపడగనేల ఘనుడననుచు
*దత్తపది*
*గిడుగు, గొడుగు, బడుగు, పిడుగు*
2. *తే.గీ.*
గిడుగురామమూర్తియెమన గిరిజనులను
గొడుగు గప్పిన విధమున గూడెమందు
బడుగులకుసాయమునుజేసె బాగుకోరి
పిడుగు పడినట్టు నాయెను పెద్ద లకును.
*సమస్యాపూరణం*
*పందిపూజను జేయగా భాగ్యమబ్బు*
3 *తేటగీతి*
విశ్వమునవిష్ణుదేవుడు వేలకొలది
రాక్షసులతోడపోరాడ రంగమందు
లోకపాలకుడవ్వగ లోకమెల్ల
పందిపూజనుసేయగ భాగ్యమబ్బు
*సమస్యాపూరణం*
*పందిపూజజేయభాగ్యమబ్బు*
4 *ఆటవెలది*
విష్ణు మూర్తి విశ్వ వెలుగుకై పోరాడి
రాక్షసులనుజంపెరంగమందు
లోకమంతటికిని రూఢిగా పాలించ
పందిపూజసేయ భాగ్యమబ్బు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి