*సున్నితాలు*: - మొక్కలు నాటు సంరక్షించు-*వనపర్తి గంగాధర్* *హన్మకొండ*-చరవాణి ::9440146435

 తరువులు జీవన ఆదరువులు
పర్యావరణమే మనకు జీవావరణము
ప్రకృతే జీవన వికాసము
చూడచక్కని తెలుగు సున్నితంబు

గాలి,నీరు కాలుష్యం
కాకుండా కాపాడాలి మనం
విరివిగా వృక్షాలను పెంచుదాం
చూడచక్కని తెలుగు సున్నితంబు

అడవులను నరకడం ఆపుదాం
ప్లాస్టిక్ వస్తువులను నిషేదిద్దాం
ప్రకృతి పాడుకాకుండా కాపాడుదాం
చూడచక్కని తెలుగు సున్నితంబు

అవనంతా వనాలను పెంచుదాం
భూరుహాలతో భూమిని నింపేద్దాం
కాలుష్య భూతాన్ని తరుముదాం
చూడచక్కని తెలుగు సున్నితంబు

మనచుట్టు నాటుదాం చెట్లు
అందరికి ఆరోగ్యం పంచుదాం
చేద్దాం జీవితాలను సుఖమయం
చూడచక్కని తెలుగు సున్నితంబు