లావవుతామా!**డి.కె.చదువులబాబు--చరవాణి‌,,.9440703716.

 రామ్మూర్తి , సరోజమ్మల కుమారుడు కిరణ్.
తొమ్మిదవతరగతి చదువుతున్నాడు,
ఆరోజు ఆదివారం.స్కూల్ లేదు." కూరగాయలమ్మా...కూరగాయలు" అంటూగట్టిగాఅరుపువినిపించింది.ఓనడివయస్సు వ్యక్తితోపుడుబండి తోసుకుంటూ వస్తున్నాడు,
" కిరణ్ గిన్నె తీసుకురా" అని కేకేసి బండిని
ఇంటిముందు ఆపింది సరోజమ్మ,కిరణ్ గిన్నె
తీసుకొని వచ్చాడు.ఎదురింటి పార్వతమ్మ,
పక్కింటి శారదమ్మ కూడా బండిదగ్గరకు
వచ్చారు,నాలుగుచక్రాల తోపుడుబండిపై
వంకాయలు,క్యారెట్లు,బెండకాయలు
,కోసుగడ్డలు,ఉర్లగడ్డలుఉన్నాయి.కిలోవంకా
యలధర అడిగింది సరోజమ్మ, ఇరవైరూపాయలుచెప్పాడు.కిలో ఉర్లగడ్డల ధర అడిగిందిపార్వతమ్మ.ఇరవైరూపాయలు చెప్పాడు,
"పదిహేనురూపాయలుచేసుకోతీసుకుంటాం"అంది శారదమ్మ.
" ఆధరకు నాక్కూడా రాలేదమ్మా" అన్నాడు.
"పోనీ పదహారు రూపాయలకివ్వు" అంది సరోజమ్మ.ఇవ్వలేనన్నాడు.గీచిగీచి బేరమాడి పద్దెనిమిది రూపాయలకు ఒప్పించారు.అరకిలోవంకాయలుతీసుకుంది పార్వతమ్మ,
"అంతకచ్టితంగాతూచావు,బంగారమాఏంటి"అంటూకొసరుగా రెండు వంకాయలు తీసుకుందిపార్వతమ్మ, వాడువారించినా ఆమె వినలేదు,
అరకిలో ఉర్లగడ్డలు తీసుకుంది శారదమ్మ.
కొసరుగా రెండు గడ్డలు తీసుకుంది. సరోజమ్మకూడా అలాగే తీసుకుంది, వాడు బిక్కమోహంవేశాడు,ఇదంతాచూస్తున్న కిరణ్ ఆగలేకపోయాడు.
" అమ్మా! ఓమాట చెబుతా విను." అన్నాడు.
ఏంటో చెప్పు..." అంది సరోజమ్మ.
ఆయనకు కిలోకు మూడురూసాయలు లాభంమిగిలినా ఎన్ని కిలోలు అమ్మితే వందరూపాయలు లాభంవస్తుంది?కొసరు అంటూ అరకిలోకురెండు కాయలు తీసుకుంటే ఆయనకు మిగిలే
దేముంటుంది? కాళ్ళు,చేతులు నొప్పులు పుట్టేలా బండిని తోసుకుంటూతిరిగితే తప్ప
దినం గడవదు కదా! ఆయన తెచ్చే తిండి
గింజలకోసం ఇంట్లో నాలాంటి పిల్లలు ఎదు
రుచూస్తుంటారు కదా! మామిడిపండ్లు,సపో
టాల గంప మెడనొప్పులు పుట్టేలా  తలపై
మోస్తూ వచ్చే ఆమెను కూడా ఇలాగే బాధపెడతారు.దానంచేయటానికి  మనస్సు రాకపోయినా పర్వాలేదు.కష్టపడేవారికి సరిపడే ప్రతిఫలంఇవ్వలేమా? గీచిగీచి బేరమాడి రెండు రూపాయలు,రెండు కాయలు తీసుకుంటే మనంలావవుతా
మా?” అన్నాడు,
కిరణ్ మాటలకువాళ్ళుఉలిక్కిపడ్డారు.
తలతిరిగినట్లయింది.ఎవరిదగ్గర బేరమాడాలో,ఎవరిదగ్గర బేరమాడ కూడదో అర్థమయింది.తానుతీసుకున్న రెండు కాయలు,రెండు రూపాయలు
తీసిఇచ్చింది సరోజమ్మ. పార్వతమ్మ, శారదమ్మకూడా తిరిగిచ్చారు,
అంతవరకూ బేలగా చూస్తున్న ఆమనిషిముఖం
లో సంతోషరేఖ తళుక్కుమంది.ఆయన ముఖంలో సంతోషాన్నిచూసి వాళ్ళ మనస్సు తృప్తితో నిండి పోయింది,
కిరణ్ ముఖం మల్లెపువ్వులా విచ్చుకుంది.