\బాలగేయం పేరు: పిల్లలు-తుళ్ళింతలు. రావి పిల్లి వాసుదేవరావు. 9441713136.
బాలలంటే బంగారం 
పిల్లలంటే మమకారం 
బాలలంటే అనురాగం 
పిల్లలంటే అపురూపం  

పిల్లల కేరింతలన్ని 
కల్లలేని తుళ్ళింతలు 
పిల్లల కలబోతలన్ని 
ముచ్చటైన వరాలు 

ఆటల్లో పాటల్లో 
ఎన్నెన్నో సరదాలు 
మాటల పూదోటల్లో 
తేనెలొలుకు పదాలు 

ఊసులలో ఊహలలో 
ఎన్నెన్నో రాగాలు 
ఆశలలో బాసలలో 
ఎన్నో సంతోషాలు 

పిల్లల ఆప్యాయతలు 
ఇచ్చును ఆనందాలు 
పిల్లల అభిమానాలు 
నిలుపును మన బంధాలు