బాలల లోకం రావిపల్లి వాసుదేవరావు -పార్వతీ పురం 9441713136.

ఆటలు ఆడెద 
పాటలు పాడెద 
మక్కువ తో నూ 
కథలను చదివెద

సందడి చేసెద 
చెలిమిని చేసెద 
చదువులు లోనూ 
సాధన చేసెద 

తరువులు పెంచెద 
కరువును బాపెద 
పరిసర అందం 
తెరలుగా పెంచెద 

ఓరిమి కలిగెద 
నేరుపు కలిగెద 
ఆపద లోనూ 
సాయం చేసెద 

జాబిలి చూసెద 
తారక చూసెద 
రంగుల లోకం 
అందం చూసెద 

కామెంట్‌లు