బాలగేయం పేరు: సైన్స్ సంబరం రావిపల్లి వాసుదేవరావు--పార్వతీ పురం 9441713136.
మా బడిలో జరిగింది సైన్స్ సంబరం
మాలో ఉప్పొంగింది ఎంతో ఉత్సాహం
రకరకాల ప్రదర్శనలు చేసి చూపాము
ప్రదర్శనలతో మెదడుకు పదును పెట్టాము 

సౌరశక్తితో మేము యంత్రాలే తిప్పాము
యంత్రాలతో మేము అద్భుతాలే చేసాము 
కటకాల కిటుకులన్నీ నేర్పుతో చూపాము 
దర్పణాలు కున్నట్టి ధర్మాలను చెప్పాము 

కాలుష్యం తగ్గించే ప్రదర్శనలు చేసాము
పర్యావరణము పట్ల బాధ్యతనే పెంచాము 
ప్రక్రృతిలో ఉన్నట్టి జ్ఞానాన్ని పంచాము
మూఢనమ్మకాలును అసలే వద్దన్నాము 

క్రృత్రిమ మేధస్సు యొక్క లాభాలును తెలిపాము 
రోబోలు చేసేటి పనులను చూపించాము 
అంతరిక్ష ప్రయోగాల నమూనాలు చూపాము 
డ్రోనుల ఉపయోగాలు విడమరచి చెప్పాము 

మందు మొక్కల లాభాలు మెండుగా చెప్పాము 
పోషకాల ప్రాధాన్యత చక్కగ వివరించాము 
జీవితంతో శాస్త్రమునకు బంధాన్ని తెలిపాము 
పెద్దలతో మేము శెభాష్ అనిపించుకున్నాము