*అక్షర మాల గేయాలు*--*'గ' అక్షర గేయం*:- --వురిమళ్ల సునంద,ఖమ్మం-9441815722

 గళ్ళ పరికిణి కట్టుకొని
గంధం మెడకూ పూసుకొని
గంటీలు చెవులకు పెట్టుకుని
గజ్జెలు కాళ్ళకు కట్టుకుని
గలగలా పారే నది వోలే
గంగ నడిచి వచ్చింది
గణగణ గంట వినగానే
గబగబ బడికీ వెళ్ళింది